Movies

హీరో వినీత్ కూతురు కూడా ‘నటి’అని తెలుసా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి,ఆతర్వాత హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినీత్ సరిగమలు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మలయాళం అతడి మాతృ భాష. శాస్త్రీయ కళల్లో ఆరితేరిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వినీత్ కూడా శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సాధించాడు. చిన్ననాటి నుంచి భరత నాట్యం లో శిక్షణ పొందిన వినీత్ ఎన్నో డాన్స్ షోస్ ఇచ్చాడు. తెలుగు ,తమిళ,కన్నడ ,హిందీ భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇతడి ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫామిలీ అని చెబుతారు. భార్య ,ఓ కూతురు వినీత్ కి ఉన్నారు. ఇతడి భార్య చాలా అందంగా ఉంటుంది. కూతురి పేరు అవంతి. తెలుగులో సరిగమలు,ఆరో ప్రాణం,నీ ప్రేమకై, ఏవండీ పెళ్లి చేసుకోండి,రుక్మిణి,వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్,మా అన్నయ్య,లాహిరి లాహిరి వంటి సినిమాలతో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న వినీత్ ప్రేమ దేశం మూవీలో అబ్బాస్ తో కలిసి నటించి అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టాడు.

రాను రాను తెలుగు సినిమాల్లో నటించడం మానేసాడు. ఎందుకంటే కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ గుర్తింపు రాలేదు. అయితే మలయాళం, కన్నడ రంగాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బాగా రాణిస్తున్నాడు. ఇక ఇతడి వారసత్వం కూడా సినీ రంగంలోకి రాబోతోందట. కూతురు అవంతి చాలా క్యూట్ గా ఉండడం వలన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట.