వారి శాపమే మన తెలుగు హీరోలకు తగిలిందా…?
హీరోలుగా ఓ ఊపు ఊపేసి తర్వాత ఇంట్లో వాళ్ళ దెబ్బతో చతికిలబడ్డవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోలంతా స్లో మార్కెట్ తో వెళుతుంటే అల్లరి నరేష్ హిట్స్ మీద హిట్స్ కొడుతూ నెట్టుకొచ్చేవాడు. అయితే ఇతనికి పెళ్లయ్యాక వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. సిల్లీ ఫెలోస్,సెల్ఫీ రాజా,ఇంట్లో దెయ్యం నాకేం భయం,ఇలా అన్ని మూవీస్ బోల్తా కొట్టాయి.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మహర్షి మూవీలో చేయడం ద్వారా అల్లరి నరేష్ మళ్ళీ సీన్ లోకి వచ్చాడు. ఇక సాయికుమార్ కొడుకు ఆదికి కూడా పెళ్లి అచ్చిరాలేదేమో. ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమకావాలి,లవ్లీ వంటి మూవీస్ తో ఇమేజ్ తెచ్చుకున్న ఆది కి అరుణ తో పెళ్లి తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బుర్రకథ, చుట్టాలబ్బాయి,శమంతకమణి వంటి సినిమాలన్నీ పెళ్లి తర్వాత బోల్తా కొట్టేశాయి. చేతిలో సినిమా ఏదీ లేదు.
విలన్ గా ఎంట్రీ ఇచ్చి,ఆతర్వాత హీరోగా మారిపోయి,స్టార్ హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్న గోపీచంద్ కి 2013లో హీరో శ్రీకాంత్ మేనకోడల్ని ప్రేమించి పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఫామిలీ లైఫ్ కి ఇబ్బంది లేకుండా నడుస్తున్నా, పెళ్లయ్యాక సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది. సౌఖ్యం,గౌతమ్ నందా ,చాణక్య ఇలా అన్నీ బోల్తా కొట్టడం తో పెళ్లి అచ్చిరాలేదేమో అని అంటున్నారు. మంచు మనోజ్ విషయానికి వస్తే బాలనటుడిగా నటించి, పెద్దయ్యాక హీరో అయ్యాడు. కానీ లవ్ మేరేజ్ చేసుకున్నాక పెళ్లి విషాదం అయింది. ఇద్దరూ విడిపోయారు. ఇక గుంటూరోడు,ఒక్కడు మిగిలాడు,ఎటాక్ ఇలా అన్నీ కూడా ప్లాప్ అయిపోవడంతో సినిమాల్లో కూడా కనిపించడం లేదు.