ఎవరి రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే షాక్?
ఆరోజుల్లో ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరరావు సమ ఉజ్జీలుగా ఉండేవారు. ఇద్దరినీ ఇండస్ట్రీకి రెండుకళ్ళుగా భావించేవారు. అయితే పాటలకు స్టెప్స్ వేయడం అక్కినేని తోనే ట్రెండ్ మొదలైంది. ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ కి సినిమా సినిమాకి ప్రొడ్యూసర్ మారిపోతుంటే, కొన్ని సంస్థలు మాత్రం అక్కినేని తోనే సినిమాలు తీసేవి. సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ, అంజలీదేవి,ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ,జగపతి ఆర్ట్ పిక్చర్స్, పద్మశ్రీ ప్రొడక్షన్స్ ఇలా కొన్ని సంస్థలు అక్కినేనితోనే తీసేవారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతేనో,అమెరికా వెళ్ళినపుడో మరో హీరోతో తీసేవారు’ అని వివరించారు.
ఇలా ఒకే హీరోతో తీసే సంస్థల వలన ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం లాంటి సత్సంబంధాలుంటాయి. ఈవిధంగా మంచి సర్కిల్ ని అక్కినేని కొనసాగించారు. దీనివలన రెమ్యునరేషన్ లో పెద్దగా పట్టింపు కూడా ఉండదు. ఒక్కోసారి తక్కువ ఎక్కువ ఉంటాయి. సినిమా ఆడినదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎన్టీఆర్ కి అయితే ప్రొడ్యూసర్స్ మారడం వలన రెమ్యునరేషన్ లో తేడాలు ఉంటాయి. ఇక 1960ప్రాంతాల్లో హీరోకి లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఉండేది. సావిత్రి,నాగయ్య,ఎస్వీ రంగారావు,రేలంగి వీళ్ళందరూ లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాక నాగేశ్వరరావు లక్ష తీసుకున్నారట.
మరి అక్కినేని ని ఎన్టీఆర్ ఎక్కడ డామినేట్ చేసారంటే,చాలా సినిమాలు ప్లాప్ తర్వాత నిప్పులాంటి మనిషి సినిమా ఆడింది. ఇక అశ్వినీదత్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి తీసాడు. తర్వాత అడవి రాముడు,వేటగాడు,వంటి సినిమాలు వచ్చేసాయి. యాక్స్ టైలర్ గమ్మత్తుగా మెడకనపడకుండా పెద్ద కాలర్ పెట్టి కుట్టడం వలన ఎన్టీఆర్ కుర్రాడిగా కనిపించడం స్టార్ట్ అయింది. దాంతో ఆరులక్షల నుంచి మేజర్ చంద్రకాంత్ కి వచ్చేసారి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 4కోట్లకు చేరింది. మొదట్లో అక్కినేని ఎక్కువ తీసుకున్నా, ఎండింగ్ లో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా ముందుకొచ్చారు. దీన్ని అక్కినేని అధిగమించలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్,పవన్ వీళ్లంతా 25కోట్లకు చేరిపోయారు.