Movies

పటాస్ సద్దాం ఈ స్థాయికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు

కొన్ని పనులు చేయాలంటే అంత సులభం కాదు. సరైన గమ్యాన్ని నిర్దేశించుకుంటే ఎంతటి పనైనా చేయవచ్చని పటాస్ షో ద్వారా పరిచయం అయిన సద్దాం హుస్సేన్ నిరూపించాడు. పటాస్ షో నుంచి సక్సెస్ అందుకున్న సద్దాం హుస్సేన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తన స్కిట్స్ ,కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. స్వయం కృషి ,పట్టుదలతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ షోకి రాకముందు అతడు ఏమిచేసేవాడో తెలిస్తే షాకవుతారు.

సద్దాం తండ్రి రైతు గా వ్యవసాయం చేస్తూ గొర్రెల వ్యాపారం కూడా చేసేవాడు. స్కూల్ లో చదివేటప్పుడు ఎన్నో నాటకాలను వేసిన సద్దాం తన తండ్రి ఆసుపత్రి పాలవ్వడంతో వ్యవసాయం ,వ్యాపారం చేస్తూ,ఖాళీ సమయాల్లో టీ అమ్ముకుంటూ బతికేవాడట. మరోపక్క నాటకాల్లో నటించేవాడు. స్కిట్స్ ద్వారా పిల్లలను నవ్విస్తూ ఉండేవాడట. అందరూ జాలిచూపేవారే తప్ప ఆదుకునేవారు లేకపోవడంతో సినిమాల్లోకి వెళ్లి అక్కడ ప్రయత్నం చేయమని చెప్పారట.

అయితే సినిమాల్లో ట్రై చేయడానికి వచ్చిన సద్దాం కి పటాస్ షో లో ఛాన్స్ వచ్చింది. దాంతో కమెడియన్ గా చేరి తనకు వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చేద్దామని అనుకున్నాడట. కానీ తనకున్న ఫాలోయింగ్,పాపులార్టీ చూసి కదలకుండా ఉండిపోయాడట. సినిమాల్లో కూడా కమెడియన్ గా ఛాన్స్ లు వస్తున్నాయి. లైఫ్ లో మరింత అభివృద్ధి చెందాలని పలువురు కోరుకుంటున్నారు.