Movies

బన్నీ తో ఉన్న బామ్మ ఎవరో తెలుసా?

గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ ను కూడా భయపెడుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. సెలబ్రటీలు హోమ్ క్వారంటైన్ కె పరిమితమైపోయారు. తాజాగా అల్లు అర్జున్, తన నాన్నమ్మతో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ షూటింగులో అల్లు అబ్బాయి ఇప్పటికే జాయిన్ కావాల్సింది.

కరోనా కారణంగా కేరళ షెడ్యూల్ వాయిదా పడింది. ఇటీవలే చిత్తూరు సంబంధించి క్లాసెస్ తీసుకుంటున్న బన్నీ, ఫ్యామిలీతో కలసి టైం స్పెండ్ చేస్తున్నాడు.తాత స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నం గారితో సరాదాగా గడుపుతున్న ఫోటోకు ‘ప్రియమైన వారితో క్వారంటైన్ లైఫ్.. మంచి అనుభూతి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అర్జున్. ఈ ఫోటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. సుకుమార్ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్‌మెన్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం.