Movies

అనసూయ సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా? హీరోయిన్ మించి

హీరోయిన్స్ ఒక్క సినిమా చేస్తే 2 కోట్లు వస్తున్న రోజుల్లో ఏడాదికి 2 కోట్లు ఓ లెక్క అంటే…. అది ఓ లెక్కనే. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యాంకర్ అనసూయ ఏడాదికి 2 కోట్లు సంపాదించడం అంటే మాటలు కాదు, హాట్ యాంకర్ గా పెళ్లి తర్వాత పరిశ్రమలోకి అడుగుపెట్టి, గ్లామర్ తోనే యాంకర్ అనే పదానికి కొత్తర్ధం చెప్పింది.

సుమ కనకాల తర్వాత అనసూయ అనేలా క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. సుమ తెలివితేటలతో నెడుతుంటే…. అనసూయ గ్లామర్ తో అదరగొడుతుంది. ఇటు జబర్దస్త్ షోతో విపరీతమైన క్రేజ్, అటు వెండితెర పై నటన ప్రాధాన్యమున్న పాత్రలు…. ఇలా రెండు చేతుల ఆర్జన చేస్తున్న అనసూయ ఏడాదికి 2 కోట్లు వెనకేస్తుందట. ఈటీవీ, జెమినిటీవీ, జీ ఛానల్ ఎక్కడ చుసిన అనసూయ.

అటు ఆడియో లాంచ్ వేడుకలు, ఇటు వెండితెరపై మంచి పాత్రల మధ్య అవార్డు వేడుకల స్టేజ్ పై స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతుంది అనసూయ. సంపాదన కోట్లలో ఉంటె…యాంకర్ గా ఏడాదికి ఓ 20 లక్షలు అందుకుంటున్న అనసూయ స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా మరో 10 లక్షలు వెనకేస్తుంది. ఇక సినిమాల్లో క్యారెక్టర్స్ కి ఇంతని ముందే మాట్లాడుకొని అందులో దిగుతుంది.