సీరియల్స్ లో నటిస్తున్న వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా ?
ప్రస్తుతం స్వాతి చినుకులు,బంధం సీరియల్స్ లో దూసుకెళ్తున్న టివి నటుడు భరద్వాజ్ గతంలో మొగలి రేకులు సీరియల్ లో అమీర్ గా ,శ్రావణ సమీరాలు సీరియల్ లో అర్జున్ బాబుగా అందరినీ అలరించాడు. తన నటనతో టివి ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. జనవరి 25న హైదరాబాద్ లో రాకేష్,పద్మావతి దంపతులకు రంగావఝల భరద్వాజ్ జన్మించాడు. ఇతడికి ఓ సిస్టర్ ఉంది. తండ్రి చిన్నపుడే చనిపోవడంతో తల్లే పెంచి పెద్ద చేసారు. బాల్యం కూడా అక్కడే గడిచింది. డిగ్రీ పూర్తిచేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
కిరణ్మయి అనే ఆమె చిన్ననాటి నుంచి తెలియడంతో ఆమెను ప్రేమించి భరద్వాజ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ పాప ఉంది. మొగలి రేకులు సీరియల్ లో కీర్తనగా చేసిన రాగ మాధురి నిజానికి భరద్వాజ్ కజిన్. ఆమె ద్వారానే ఇండస్ట్రీలోకి భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చాడు. మంజులా నాయుడు తగిన క్యారెక్టర్ కోసం మంచి పర్సనాలిటీ గల వ్యక్తి కోసం వెతుకుతుంటే, రాగ మాధురి అప్పుడు ఈ విషయం భరద్వాజ్ కి చెప్పారట. దాంతో ఆడిషన్స్ కి వెళ్లి సెలక్ట్ అయ్యాడు.
అమీర్ అనే పాత్రలో నెగెటివ్ షెడ్ లో చేసాడు. మళ్ళీ మంజులా నాయుడు డైరెక్షన్ లోనే శ్రావణ సమీరాలు సీరియల్ లో కూడా నటించే ఛాన్స్ వచ్చింది. నీలికలువలు, పుత్తడి బొమ్మ,వంటి సీరియల్స్ లో కూడా నటించిన భరద్వాజ్ తన కెరీర్ ని బుల్లితెరపై అందంగా మలచుకున్నాడు. ప్రస్తుతం స్వాతిచినుకులు,బంధం అనే సీరియల్స్ లో నటిస్తున్నాడు. అయితే శ్రావణ సమీరాలులో చేసిన అర్జున్ బాబు క్యారెక్టర్ అంటే ఇతడికి చాలా ఇష్టమట. జై జానకి రామ్,ఆర్డీ ఎక్స్ సినిమాల్లో నటించాడు.