ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “ప్రేమ కావాలి” అనే చిత్రం మంచి విజయం సాధించింది.అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ సీనియర్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది, ఇషా చావ్లా నటించారు.అయితే ఈ ఇద్దరికీ ఈ చిత్రం మొదటి చిత్రం కావడం విశేషం.
దీంతో ఈ చిత్రం తర్వాత ఇద్దరూ బాగానే వరుస అవకాశాలు దక్కించుకున్నారు.అయితే ఇషా చావ్లా మాత్రం కథల విషయంలో అవగాహన లేమి కారణంగా హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.దీంతో ఉన్నట్లుండి తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది.అయినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది ఈ అమ్మడు.
అయితే ఈ మధ్య కాలంలో ఇషా చావ్లా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అందువల్లనే సినీ పరిశ్రమకు దూరం అయిందంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయి.అయితే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ మధ్యకాలంలో ఇషా చావ్లా ఇద్దరు పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పెళ్లి అయిన మాట వాస్తవమే అంటూ నమ్ముతున్నారు.ఐతే ఇషా పెళ్లి పై వస్తున్నటువంటి ఈ వార్తల పై ఈ అమ్మడు మాత్రం అస్సలు స్పందించడం లేదు.దీంతో ఈ మధ్యకాలంలో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.కనీసం ఇప్పటికైనా ఈ ఇషా చావ్లా తన పెళ్లి వార్తలపై స్పందించాలని తన అభిమానులు కోరుతున్నారు.
అయితే తెలుగు, కన్నడలో దాదాపుగా 7 పైగా చిత్రాల్లో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది.ఇందులో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ తో రెండు చిత్రాల్లో నటించగా, బాలయ్య బాబు సరసన శ్రీమన్నారాయణ అనే చిత్రంలో నటించింది.
అయితే ఈ ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలు పర్వాలేదనిపించినా మిగిలిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి.అయితే ఉన్నట్లుండి ఈ ఒక్కసారిగా ఇషా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ తెలియడం లేదు.