ఆన్లైన్ కోర్సులో బిజీగా ఉన్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు ఉంది.దీంతో సినిమా షూటింగ్‌లతో పాటు అన్ని పనులు వాయిదా పడ్డాయి.అయితే అనుకోకుండా వచ్చిన ఈ సెలవులను ఆలియా భట్ చాలా బాగా వినియోగించుకుంటోంది.ఆన్లైన్లో క్రియేటివ్ స్క్రిప్ట్‌రైటింగ్ కోర్సును నేర్చుకుంటోందట ఈ బాలీవుడ్ బ్యూటీ.
మొత్తానికి సెలవులను వృథా చేయకుండా ఇలా కోర్సుతో తన ప్రతిభను పదును చేసుకుంటోంది ఈ బ్యూటీ.ఇలా ఆలియా భట్ కోర్సు చేస్తుందనే విషయంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్లో అమ్మడు ఇంకా జాయిన్ కావాల్సి ఉంది.