ఆమెకథ రాణికి కార్తీకదీపం మోనితకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
తెలుగు బుల్లితెరపై ఆమె కథ సీరియల్ అంత్యంత ప్రజాదరణతో నడుస్తోంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో గౌతమ్ గా రవికృష్ణ,మల్లీశ్వరిగా నవ్య ఘోష్ నటిస్తున్నారు. ఇక రాణి పాత్రలో నటించే అమ్మాయి పేరు మేఘన ఖుషీ కర్ణాటకలోని బెంగుళూరులోనే పుట్టి పెరిగి అక్కడే చదువుకుంది. ఫ్రీలాన్సర్ వెబ్ మార్కెటింగ్ లో డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈమేరకు కోర్సు కూడా చేసింది. ఈమెకి నవీన్ అనే ఓ తమ్ముడు ఉన్నాడు.
ఇక మేఘన అందం,పర్సనాలిటీ చూసి మోడలింగ్ రంగంలో ప్రయత్నాలు చేయాలనీ ఫ్రెండ్స్ , మిగతావాళ్ళు చెప్పడంతో మేఘన ఆ రంగంలోకి అడుగు పెట్టింది. ఉదయ టివిలో ప్రసారమయ్యే,అవళు సీరియల్ లో ఓ పాత్ర పోషించింది. ఈటీవీలో ప్రసారమయ్యే స్వర్ణ ఖడ్గం సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆతర్వాత ఆమె కథలో నటించిన మేఘనకు కార్తీక దీపం సీరియల్ లో నటించే మోనితకు ఓ లింక్ ఉందట. అదేంటని వివరాల్లోకి వెళ్తే,మేఘన,మోనిత కల్సి ఈటీవీలో లాహిరి లాహిరి లాహిరి అనే సీరియల్ లో కల్సి నటించారు. మేఘన కోకిల అనే పాత్ర చేయగా, మోనిత లీడ్ రోల్ లో వేసింది. అదండీ వీరిద్దరి బంధం.