మహేష్ బాబు రెండో సినిమాకే హైయెస్ట్ పారితోషికం…ఎంతో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి,ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు యూత్ లో ,లేడీస్ లో మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్నవాడు. పైగా రెమ్యునరేషన్ రీత్యా కూడా అతడి క్రేజ్ అంచనా వేయొచ్చు. మార్కెట్ వేల్యూ కూడా అతడి క్రేజ్ ని తెలియజేస్తుంది.
అంతెందుకు హీరోలకు 1970లలో 5లక్షలు,1980లలో 20లక్షలు గా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఉండేదట. అయితే 1992తర్వాత కోటి రూపాయలు దాటేసింది. 2000నాటికి రెండు కోట్లకు చేరింది. టాప్ ఫోర్ హీరోలకు వచ్చే రెమ్యునరేషన్ ఇది. అయితే ఎంత పెద్ద మార్కెట్ గల హీరో అయినా 50లక్షలు మించి ఇచ్చేవారు కాదట.
అయితే 1999లో ఎంట్రీ ఇచ్చి, ఒక్క సినిమా చేసాక,రెండవ సినిమాకే 75లక్షలకు మహేష్ రేంజ్ పెరిగింది. అప్పట్లో అన్ని సినీ మ్యాగజైన్స్ లో ఇతడి గురించి ప్రత్యేకంగా రాయడం విశేషం. మొదటి సినిమాతోనే తన సత్తా చాటడం వల్లనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కి చేరాడు. అప్పుడే కాదు, ఇప్పటి మార్కెట్ వేల్యూతో పోలిస్తే ఇంతటి రెమ్యునరేషన్ ఎవ్వరూ పొందలేదు.