Movies

రోజా స్టార్ హీరోయిన్ కావటానికి ఆ హీరోయిన్ కారణమా…?

ఒక్కోసారి పరిస్థితులు ఒకరికి శాపంగా మారితే,మరొకరికి అనుకూలంగా మారతాయి. సినిమాల్లో కూడా కొందరికి వచ్చిన పాత్ర అనివార్య కారణాల వలన ఇంకొకరికి వెళ్లిపోతుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ప్రముఖ హీరోయిన్,జబర్దస్త్ జడ్జి,ఎమ్మెల్యే రోజా విషయంలో ఇదే జరిగిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ కథా రచయత ,దర్శకుడైన పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానెల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. రోజా హీరోయిన్ గా నటించిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘ప్రేమ తపస్సు’. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించాడు.

అందులో బాగానే నటించినప్పటికీ ఆ తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమా పరుచూరి బ్రదర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్ర కోసం ముందుగా మీనా అనుకున్నారు. కానీ అప్పటికే ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో మీనా మంచి రేంజ్ లో ఉంది. కానీ సర్పయాగం సినిమాలో హీరో కూతురు చనిపోయే పాత్ర లో నటించాలి.

అయితే అప్పటికే హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అయిన మీనాతో ఆ పాత్ర చేయిస్తే ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోరనే ఉద్దేశ్యంతో పరుచూరి వేరే కొత్త వాళ్లతో చేయిద్దాని డాక్టర్ రామనాయుడితో అన్నారట. అయితే అప్పటికే మీనాకు రామానాయుడు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. కానీ మాజీ ఎంపీ నటుడు శివప్రసాద్ తాను డైరెక్ట్ చేసిన ప్రేమ తపసు చూడమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారట. ఆ సినిమ చూసి రోజా నటనకు ఫిదా అయిన పరుచూరి బ్రదర్స్ ‘సర్పయాగం’ లో శోభన్ బాబు కూతురు పాత్ర కోసం రోజాను సెలెక్ట్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలా మీనా చేయాల్సిన పాత్ర రోజా చేసి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.