నా బలం, బలహీనత రెండూ అవే అంటున్న అనసూయ
జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ అప్పడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంది.రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా నటిగా ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది. ఇటు యాంకర్ గా అటు నటిగా వరుస అవకాశాలు తెచ్చుకుంటున్న అనసూయ సొషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె మీద వచ్చే ట్రోల్స్ పై కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.
అయితే లాక్ డౌన్ కారణంగా టీవీ ప్రోగ్రామ్స్ ఏవీ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన అనసూయ వెబ్ సిరీస్ లు చూస్తుందట. ఈ సమయంలో అభిమానులతో ముచ్చటించిన అనసూయ తనకి అంత పాతపేరు ఎందుకు పెట్టారన్న విషయాన్ని చెప్పింది. వాళ్ల నాన్నమ్మ పేరు అనసూయని ఆమెకి పెట్టారంట. స్వస్థలం నల్గొండ జిల్లా కాగా తన అభిమానుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
తను చాలా ఎమోషనల్ పర్సన్ అనీ, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అనీ, తన బలం బలహీనత రెండూ కుటుంబమే అనీ.. కుటుంబంతో తనకి ఉన్న అటాచ్ మెంట్ ని ఒక్కముక్కలో చెప్పేసింది. అనసూయ ప్రస్తుతం క్రిష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది.