“ధూమ్” కంటే “రెబల్” గ్రేట్..ఎందుకలా.?
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య నడుస్తుంది. వారే హృతిక్ మరియు ప్రభాస్. ఇద్దరూ ఇద్దరే ప్రభాస్ లేటెస్ట్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టినా అక్కడి బడా హీరోల బాక్సాఫీస్ కే ఎసరు పెట్టాడు. అలా ప్రభాస్ మన టాలీవుడ్ లోను మరియు బాలీవుడ్ లోను ఒకే స్టార్డం ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కోసం టాపిక్ రావడానికి ఒక కారణం ఉంది.
ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలోని క్లైమాక్స్ యాక్షన్ సీన్ 100 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. ఇది నిజంగా ఒక సెన్సేషన్ దీనితో కేవలం ఒకే ఒక్క సీన్ తో 100 మిలియన్ మార్క్ టచ్ చేసింది మన ఇండియన్ హిస్టరీలో ప్రభాస్ ఒక్కడే అని సోషల్ మీడియాలో టాపిక్ మొదలు పెట్టగా హృతిక్ ఫ్యాన్స్ వచ్చి దీని కంటే ముందు 100 మిలియన్ మార్క్ అందుకుంది.
“ధూమ్ 2” లోని “పర్ఫెక్ట్ థీఫ్” సీన్ అనే సీన్ అంటూ వచ్చారు. అయితే దీనిపై ఒక క్లారిటీ ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ధూమ్ 2 కంటే రెబల్ సీన్ గ్రేట్ అని చెప్పాలి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ రెండు వీడియోలు యూట్యూబ్ లో పెట్టి ఆరేళ్ళు దాటింది.
కానీ అప్పటి నుంచి కూడా మన తెలుగు మార్కెట్ కంటే హిందీ మార్కెటే ఎక్కువ అలాగే పాపులేషన్ కూడా ఎక్కువ ఈ లాజిక్ ప్రకారం చూసుకున్నా హిందీ వీడియోకు ధీటుగా మన వీడియో కు రెస్పాన్స్ వచ్చింది. పైగా హిందీలో ఆ వీడియో వదిలి ఏడేళ్లు అయ్యింది. తెలుగులో రెబల్ వీడియో ఆరేళ్ళు అయ్యింది. ఇలా చూసుకున్నా ధూమ్ 2 కంటే రెబల్ వీడియోనే గ్రేట్ అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు.