Movies

‘పుష్ప’ పోస్టర్ హాలీవుడ్ నుంచి కాపీ చేసారా…ఇందులో నిజం ఎంత?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ పుట్టినరోజును పురష్కరించుకుని ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నిజానికి ఇది పాన్ ఇండియా మూవీ అని ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. అస్సలు ఈ విషయాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయకుండా కరెక్ట్గా బన్నీ బర్త్ డే రోజు చెప్పి ఫ్యాన్స్ కు మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ – ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. తమిళ నటుడు విజయ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగుతో పాటు హిందీ – తమిళం – మలయాళం – కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అన్ని భాషల ఫస్ట్ లుక్ పోస్టర్లనూ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. మాసిన గెడ్డం మీసాలతో సీరియస్ లుక్ కొత్తగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మరో పోస్టర్ ద్వారా స్టోరీకి సంబంధించిన కొన్ని లీడ్స్ వదిలారు. ఈ పోస్టర్ లో గందపు చెక్కలు ఇంకా పోలీసులు ఉండటంతో గందపు చెక్కలు స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. పోలీసుల కాళ్ళ దగ్గర కూర్చున్న బన్నీని చూస్తే ఇందులో గందపు చెక్కల స్మగ్లర్ బన్నీ అని క్లీయర్ గా అర్థం అవుతుంది. ‘పుష్ప’ఫస్ట్ లుక్ పోస్టర్ ను అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

పోస్టర్ల డిజైన్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ కి సంభందించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ పోస్టర్ ఒక హాలీవుడ్ మూవీ పోస్టర్ కి కాపీ అని బన్నీ వ్యతిరేక ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. హాలీవుడ్ ‘షెర్లాక్ హోమ్స్’ మూవీ పోస్టర్ ఒకటి ఇలానే ఉంటుందని.. సుకుమార్ అదే పోస్టర్ కాపీ కొట్టేసి, పుష్ప కి వాడాడని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బన్నీ హెయిర్ స్టైల్ కూడా ఆ మూవీ నుండే తీసుకున్నారని అంటున్నారు. ఆ సినిమా పోస్టర్ ని జత చేసి పోస్టులు పెడుతున్నారు. సుకుమార్ ఇలా వేరే సినిమాల నుండి ఎత్తేసి ఇన్ స్పిరేషన్ అని చెప్పడం కొత్తేమీ కాదు కదా అని విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ‘1 నేనొక్కడినే’ సినిమాని ‘అన్ నోన్’ -‘ది బ్యూటిఫుల్ మైండ్’ చిత్రాల ను కాపీ కొట్టి తీసాడని, నాన్నకు ప్రేమతో -రంగస్థలం సినిమాలు కూడా అలా వచ్చినవే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.