Movies

రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి ఒకే సినిమా…ఆ సినిమా ఏమిటో?

ఈరోజుల్లో డిజిటిల్ స్ట్రీమింగ్ రంగం ఎంతలా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఎన్నో స్ట్రీమింగ్ సంస్థలు ఉన్నాయి. అలా మన దేశంలో కూడా అన్ని భాషల్లోనూ ప్రాముఖ్యత చెందాయి. అయితే అన్ని భాషల వారికి వీటి కోసం ఏమాత్రం చిన్న ఐడియా ఉన్న కొన్ని విషయాలని యిట్టె పసిగట్టేస్తారు.

ఇప్పుడు అలాంటి విషయమే ఒకటి బయటకొచ్చింది. మాములుగా ఒక సినిమా తాలూకా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ సంస్థ తీసుకుంటే అది ఆ యాప్ లో తప్ప మరే ఇతర సంస్థకు చెందిన యాప్ లో అందుబాటులో ఉండదు. కానీ మన తెలుగు రీసెంట్ చిత్రం “రాజావారు రాణి గారు” చిత్రం మాత్రం రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కనిపించేసరికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

కిరణ్ అబ్బవరం హీరోగా రహస్య గోరఖ్ హీరోయిన్ గా రవికిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా”లో కూడా అందుబాటులో ఉందని వారు చెప్తున్నారు. దీనితో ఇలా కూడా చేస్తున్నారా అని నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు.