యాంకర్ రవిని చితకకొట్టింది ఎవరు..?? ఎందుకో తెలుసా..??
బుల్లితెరపై చాలామంది ఫీమేల్ యాంకర్స్ పాటు మేల్ యాంకర్స్ కూడా ఉన్నారు. అందులో యాంకర్ రవి ఒకడు. సమయ స్ఫూర్తిగా పంచ్ డైలాగులు వేస్తూ కామెడీ చేయడంలో యాంకర్ రవి దిట్ట. ఎన్నో టివి ప్రోగ్రామ్స్ తో అలరించే రవి,తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొని అనుభవాలను పంచుకున్నాడు. తనకు యాంకర్ శ్రీముఖికి మధ్య ఎఫైర్ లేదని,ప్రోగామ్ చేసేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం లాంటివి మామూలే అని చెప్పాడు.
నిజానికి ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని యాంకర్ అనుకున్నాడట. సినిమాల ప్రభావం తనపై చాలా ఉందని రవి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమట. గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవి మేనరిజమ్స్ అన్నీ రియల్ లైఫ్ లో చేసేవాడట. ఇక హీరోయిన్స్ లలో ఇలియానా అంటే రవికి ఇష్టం. ఇంటర్యూలో ఒకసారి ఆమెను కలవడం సంతోషం వేసింది.
ఒకసారి బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చారు. అందరూ కిందికి వచ్చాక నేను మేడపైకి వెళ్లాను. అక్కడ కాల్చి పారేసిన సగం సిగరెట్లుంది. దాన్ని తీసి కాల్చాను. అది ఇంట్లో వాళ్లకి తెల్సి చితక్కొట్టారు’అని రవి చెప్పాడు. ఇక ఒక సినిమా ఫంక్షన్ లో ఓ మహిళను కించపరిచేలా మాట్లాడాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయానని అన్నాడు. అందరూ అలా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలనిపించింది. ‘మా అమ్మ ,నాన్న ల దగ్గర చాలామంది నా గురించి వెటకారంగా మాట్లాడ్డం బాధేసింది. ఆసమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్,సుమ మా ఇంటికి ఫోన్ చేసిన ధైర్యం చెప్పడం ఇవన్నీ నన్ను ఇండస్ట్రీలో ఉండేలా చేసాయి’అని చెప్పుకొచ్చాడు.