Movies

నాగశౌర్య క్రైమ్ థ్రిల్లర్ “అశ్వథ్థామ” ఫైనల్ డేట్ వచ్చేసింది…ఎప్పుడంటే…?

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య మరియు బ్యూటీ మెహ్రీన్ లు హీరో హీరోయిన్ లుగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “అశ్వథ్థామ”. ఊహించని క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ తో కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

కానీ బాక్సాఫీస్ పరంగా మాత్రం గట్టెక్కలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాపై మన టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఇంపాక్ట్ అయితే వచ్చింది. అందుకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వెర్షన్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.కానీ దీనిపై గత కొన్ని రోజుల నుంచి స్ట్రీమింగ్ డేట్ సన్ నెక్స్ట్ వారు వాయిదా వేస్తూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఫైనల్ డేట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 24 నుంచి సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఇదే ఫైనల్ డేట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన జిషు కోసం అయినా తెలుగు ఆడియెన్స్ ఒక రిపీట్ ఖచ్చితంగా వేస్తారని చెప్పాలి. మరి ఈ డేట్ లో అయినా ఈ చిత్రం వస్తుందో లేదో చూడాలి.