నాన్న మూవీతో పాటు బాబాయ్ మూవీలో కూడా .. చరణ్ డేట్స్ సర్దుబాటు చేయగలడా…?
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు తమ తోటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒకే చెప్పేస్తున్నారు. ఎక్కడా మొహమాట పడ్డం లేదు. ఇప్పటికే రామ్ చరణ్, తన తోటి హీరో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీని భారీ వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టు టాక్.
కరోనా లాక్ డౌన్ తో అన్ని సినిమాల షూటింగ్స్ కేన్సిల్ అయినట్టే ఆర్ ఆర్ ఆర్ కూడా షూటింగ్ నిలిపేశారు. రామ్ చరణ్ తాజాగా తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, క్రిష్ దర్శకత్వంలో బాబాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి కూడా చెర్రీ ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
పండగ సాయన్న జీవిత నేపథ్యంలో ‘విరూపాక్షి’ అనే టైటిల్ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్ర ఉందట. అది ఓ హీరో చేస్తేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్‌కు క్రిష్ చెప్పడంతో తన అన్న కొడుకు రామ్ చరణ్‌ను కలిసి ఈ స్టోరీ వినిపించమని సూచించాడట. దీంతో రామ్ చరణ్‌కు ఈ సినిమాలో అతని పాత్రను క్రిష్ వివరించాడట. ఇక బాబాయితో సినిమా అనగానే రామ్ చరణ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను ముందూ వెనుకా ఆలోచించకుండా ఒకే చెప్పేశాడట.