తమ్ముడి కోసం త్యాగం చేయటానికి సిద్ధం అంటున్న చిరంజీవి
మెగా కాంపౌండ్ నుండి రాజకీయాల్లో చేరి,ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. చిరంజీవి మొత్తం రాజకీయాల నుంచి విరమించగా,పవన్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీ అయ్యాడు. అయితే 150వ సినిమాతో చిరంజీవి ఎప్పుడో రీ ఎంట్రీ ఇవ్వగా, ‘వకీల్ సాబ్’తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ షురూ అయిందో లేదో ఒకదానిపై ఒకటిగా ఆయన చేయబోయే ప్రాజెక్టులు లైన్‌లోకి వచ్చేశాయి.
ఆవిధంగా ‘వకీల్ సాబ్’ తర్వాత, క్రిష్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఒకటుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా లైన్‌లోనే ఉంది. చిరంజీవి విషయానికి వస్తే, ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తూ,, తర్వాత మలయాళ రీమేక్ ‘లూసిఫర్’లో కూడా చేయాల్సి ఉంది. ఇక్కడ ‘లూసిఫర్’ విషయంలో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా రైట్స్‌ని చిరంజీవి కోసమే తీసుకున్నారు. ఆ సినిమాలో నటించేందుకు చిరంజీవి కూడా పాజిటివ్ గానే ఉన్నాడట.
అయితే, ఒకవేళ తమ్ముడు పవన్ కళ్యాణ్ అడిగితే, కాదనకుండా ఇచ్చేస్తానని మెగాస్టార్ తాజాగా చెప్పుకొచ్చాడు. మోహన్‌లాల్, పృధ్వీరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా రీమేక్‌లో చిరంజీవి, చరణ్ నటించబోతున్నారన్న ప్రచారం ఇంతవరకూ జరిగింది. అయితే, మెగా స్టార్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో పవన్ ఈ సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారా అనేది చర్చకు దారితీసింది. అదే జరిగితే, పవన్‌కి సరైన కాంబినేషన్ ఎవరా అనే చర్చ నడుస్తోంది.