చైతు వరుస సినిమాలు కమిట్…వెనక ఎవరు ఉన్నారో తెలుసా?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది.లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత పరశురాంతో సినిమా కమిట్ అయ్యాడు. కాని పరశురాంకి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఒకే అవడంతో ఇప్పుడు తన ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చైతు రెడీ అవుతున్నాడు.
నిజానికి చైతూ 14 రీల్స్ వారికి డేట్స్ ఇచ్చాడు. అయితే పరశురాం సినిమా ఆగిపోవడంతో 14 రీల్స్ సంస్థ ఆ డేట్స్ ని దిల్ రాజుకి ఇచ్చేసింది. ఇప్పటికే దిల్ రాజు మంచి కథని సిద్ధం చేసుకొని చైతూకి చెప్పడంతో ఇప్పుడు దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడట. ఎప్పుడు సొంత కథలు మాత్రమే రాసుకొని సినిమాలు తీసే విక్రమ్ కుమార్ కి వరుసగా రెండు ఫ్లాప్ లు రావడంతో దిల్ రాజు అతని కథని నమ్మలేదు.
బివిఎస్ రవి రాసిన కథని విక్రమ్ కి అప్పగించి దానిని దర్శకత్వం చేయాలని దిల్ రాజు ఇప్పటికే చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనని తాను ముందుగా నిరూపించుకోవాల్సి ఉంది. అందుకే విక్రమ్ కుమార్ కూడా ఇదే కథని తనశైలికి తగ్గట్లు మార్చుకొని చైతూతో లాంచ్ చేయడానికి కసరత్తు చేస్తున్నాడట. ఏది ఏమైనా లాక్ డౌన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని దిల్ రాజు స్టార్ట్ చేస్తాడని టాక్.