Movies

లాక్ డౌన్ సమయంలో నిత్యా మీనన్ ఏమి చేస్తుందో తెలుసా?

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మూడు వారాల లాక్ డౌన్ ని భారత ప్రభుత్వం అమలుచేస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా మంది నటీనటులు ఈ లాక్ డౌన్ వేళ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. పిల్లలతో కలిసి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు ఆరోగ్యం ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తుండగా.. మరికొందరు పుస్తకాలు చదువుతూ రచనలు చేస్తున్నారు. మరికొందరు ఈ ఖాళీ సమయంలో స్క్రిప్ట్ లు రాయడంపై దృష్టి సారిస్తున్నారు. మొత్తం మీద తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీ స్తూ,ఖాళీగా ఉంటున్న ఈ సమయాన్ని వినియోగించు కుంటున్నారు.

ఇక దక్షిణాది ప్రముఖ హీరోయిన్ నిత్యమీనన్ లాక్ డౌన్ ఖాళీ సమయంలో పెన్ను పట్టేసింది. ఖాళీగా ఉన్న తాను తన చుట్టూ జరుగుతున్న విశేషాలను గమనిస్తున్నానని.. నా మనసులో వచ్చిన ఆలోచనలను స్క్రిప్టులుగా చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కథలు అభివృద్ధి చేస్తున్నానని తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరం ఇంట్లో ఉండడం అవసరమని తెలిపింది.

మనం మళ్లీ బిజీగా మారడానికి చాలా సమయం పడుతుందని, ఈ ఖాళీ సమయాన్ని తాను ఇలా కథలు రాయడానికి వాడుకుంటున్నానని నిత్యామీనన్ తెలిపింది. ఇప్పటివరకు హీరోయిన్ గా బిజీగా ఉండేదానినని.. అందుకే కథలు స్క్రిప్ట్ లు చేయడానికి సమయం ఉండేది కాదని తెలిపింది. ‘ ఇప్పుడు ఖాళీ సమయాన్ని అంతా కథలు రూపొందించడానికే తీసుకుంటున్నా. ఇది నాకు చాలా స్వేచ్ఛగా అనిపిస్తోంది. కొత్త భాష కొత్త సంగీతం పాటలు నేర్చుకుంటున్నా’అని తెలిపింది.