రామ్ చరణ్ కి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది…కారణం ఎవరు ?
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీగా చేస్తున్న ఈ సినిమాకి రౌధ్రం రణం రుథిరం అన్న టైటిల్ ఇటీవల కన్‌ఫర్మ్ చేస్తూ ఎన్.టి.ఆర్ రామ్ చరణ్ ల తో ఈ సినిమా లుక్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్.టి.ఆర్ కొమర్ భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్ టీజర్‌ను పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజైన ఈ టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రాజమౌళి చిన్న శాంపిల్ చూపించారు. అంతేకాదు పాన్ ఇండియా సినిమా అన్న అంచనాలని భారీగా పెంచేశారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజా చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా దానికి ఫైనల్ అయింది. అయితే చరణ్ నెక్ట్స్ సినిమా ఏ డైరెక్టర్ తో ఉంటుందో మాత్రం ఇంకా కన్‌ఫర్‌మేషన్ లేదు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో మాత్రం ఒక గెస్ట్ రోల్ చేయాల్సి ఉంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యాకే ఆచార్యలో జాయిన్ అవ్వాలని జక్కన్న కండీషన్ పెట్టడంతో చరణ్ కి పెద్ద సమస్యలా మారిందని టాక్. మరోపక్క కొరటాల శివ మాత్రం ఆచార్య సినిమాలో అనుకున్న పాత్రలో చరణ్ ఎలాగైనా నటించమని అందుకు డేట్స్ ఇవ్వమని చిరంజీవి ద్వారా ప్రతిపాదన తెచ్చారట. దాంతో ఇప్పుడు చరణ్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా అయినందున ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం డేట్స్ మిస్ అయితే మళ్ళీ ఎన్.టి.ఆర్ తో కాంబినేషన్ సీన్స్ కి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందట. మరి చెర్రీ ఈ గండం ఎలా గట్టుక్కుతాడో చూడాలి.