Business

లాక్ డౌన్ లో దూసుకెళ్లిన జూమ్, టిక్ టాక్… ఆదాయం ఎంతో తెలిస్తే…

కరోనా విజృంభించడంతో ప్రపంచంలో అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు.ఇక కంపెనీల కార్యకలాపాలు ఇంటి నుంచి జరుగుతూ ఉండటంతో పనుల గురించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ తో వచ్చిన జూమ్ యాప్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.

ఈ యాప్ సాయంతో 50 మంది వరకు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నవారికి ఇదొక అద్భుతమైన అవకాశం అయ్యింది.దాంతో ఈ యాప్ డౌన్ లోడ్లు రాకెట్ లా దూసుకుపోయాయి.మార్చిలో ఓ వారం రోజుల్లో జూమ్ యాప్ ను 62 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఇది ఏ స్థాయిలో దూసుకెళ్ళిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.ఇక దీంతో పాటు చైనా నుంచి దిగుమతి అయిన మరో ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్ వినియోగం కూడా ఈ లాక్ డౌన్ సమయంలో విపరీతంగా పెరిగింది.

దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు సంపద కోల్పోతే వీరి ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిపోయింది. జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ ఆస్తి విలువ ఏకంగా ముప్పై వేల కోట్లకి ఈ మూడు నెలల కాలంలో పెరిగిపోయింది.టిక్ టాక్ సిఈఓ/ ఆదాయం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ లాక్ డౌన్ సీజన్ కొంత మంది వ్యాపార దిగ్గజాలని భారీగా దెబ్బతీస్తే ముందుచూపుతో ఆలోచించిన చైనాకి చెందిన జూమ్, టిక్ టాక్ వ్యాపార దిగ్గజాలు మాత్రం తమ సంపదని పెంచుకున్నారు అని చెప్పాలి.