అది ఫేక్ న్యూస్ : ఆమె నా తల్లి కాదంటున్న మెగా స్టార్ చిరంజీవి…
తెలుగు తాజాగా తెలుగు భాషకు సంబంధించినటువంటి ఓ ప్రముఖ వార్తా పత్రిక “సమాజ సేవలో మెగాస్టార్ తల్లి” అనే టైటిల్ శీర్షికతో ఓ వార్తను ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగించేటటువంటి దాదాపు 700 మాస్కులను కుట్టి తన తోటివారికి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఈ వార్తపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.ఇందులో భాగంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన తల్లి గురించి ఓ ప్రముఖ వార్తా పత్రిక రాసినటువంటి కథనంలో ఉన్నది తన తల్లి కాదంటూ స్పష్టం చేశారు.
కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఆమె కష్టపడి మాస్క్ లను తయారు చేసి ఇతరులకు అందించడం చాలా గొప్ప విషయమని ఆమెకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే అని పేర్కొన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.