Movies

తెలుగు సినిమాలు డైరెక్ట్ గా అరచేతిలో..అసలు విషయం ఏమిటో చూడండి

ఈ కరోనా మహమ్మారి మూలాన ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ కూడా చాలా దెబ్బ తిన్నది. అయితే ఈ వైరస్ ఎఫెక్ట్ మూలాన థియేటర్స్ మూసెయ్యడంతో సినిమాలు షూటింగులు ఆగిపోయాయి. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సన్నద్దమ అయిన సినిమాలు కూడా ఇంకా సిల్వర్ స్క్రీన్ పై పడకుండానే నిలిచిపోయాయి.

ఈ కరోనా ఎఫెక్ట్ మూలాన దాదాపు మూడు నెలల వరకు ఇదే పరిస్థితులు కొనసాగడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మన చిన్న సినిమాలపై ఒక వార్త ఊపందుకుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలు అన్ని నేరుగా ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లోకి వచ్చేస్తాయని ఈ ఏప్రిల్,మే మరియు జూన్ నెల వరకు విడుదల ఉండకపోవడంతో సినిమాలు అన్ని డిజిటల్ యాప్స్ లోకి వచ్చేస్తాయని వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఇవన్నీ పచ్చి అబద్దం అని సినీ ట్రాకర్స్ చెప్తున్నారు. ఇలా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చెయ్యడం మూలాన నయా పైసా ఉపయోగం ఉండదని ఈ వార్తలని ఒట్టి గాలి వార్తలే అని కొట్టి పడేసారు. అందువల్ల ఏ చిత్రం కూడాను ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేది లేదు అని ఈ వార్తలు ఎవరు నమ్మొద్దు అని తెలుపుతున్నారు.