సుమ,అనసూయ మధ్యలో అసలు ఏమి జరుగుతుందో తెలుసా?
సినిమా రంగంతో సమానంగా తెలుగు బుల్లి తెర రాజ్యమేలుతోంది. అందుకే టివి రంగంలో అడుగు పెట్టిన వాళ్ళు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అందుకుంటున్నారు. ఇక యాంకర్లు అయితే మరీను. అందుకే యాంకర్లు సుమ, అనసూయ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి అనసూయ కంటే సుమ చాలా సీనియర్. యాంకరింగ్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో వచ్చిన సుమకు ,ఈ మధ్యే వచ్చిన అనసూయకు మధ్య దాదాపు పదేళ్ళకు పైనే గ్యాప్ ఉంది.ఇద్దరికీ పెళ్లి అయినా సరే యాంకరింగ్ లో సత్తా చాటుతూనే ఉన్నారు.
ఇక వీళ్లిద్దరి మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు వచ్చాయని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఎక్కువగా సినిమా కార్యక్రమాలను సుమ చేస్తుంది. అనసూయకు అవకాశాలు వస్తున్నా సుమ తన్నుకుపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. సుమ విషయంలో అనసూయ కాస్త దూకుడుగా ఉండటమే దీనికి కారణమట. అనసూయకు కాస్త గ్లామర్ ఎక్కువ కావడంతో ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అవకాశం వస్తే తాను చీరకట్టులో అలరిస్తానని చెపుతున్న సరే, ఆమెకు ఛాన్స్ లు దక్కడం లేదట.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించే టీవీ షో విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని టాక్. ఈ ప్రోగ్రాం కోసం తొలుత అనసూయను సంప్రదించగా ఆ తర్వాత సుమ ఆ షో కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సందేశం పంపింది. తన రేట్ తగ్గించే ఆ షో కి ఓకే చెప్పిందట. దీంతో అనసూయను పక్కన పెట్టి సుమ ఇమేజ్ ఎక్కువ కాబట్టి ఆమెను తీసుకోవాలని భావించారు. అనసూయ ఇప్పుడు సుమ మీద ఆగ్రహంతో సదరు ఛానల్ నుంచే పూర్తిగా బయటకు రావాలని అనుకుంటోందట.