Movies

ఆచార్య సినిమాలో చిన్న అల్లుడు ఉన్నాడట…నిజమేనా?

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో నిహారిక నటించబోతుంది అంటూ కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.ఆ వార్తపై ఇంకా క్లారిటీ రాకుండానే మరో పుకారు ప్రారంభం అయ్యింది.

సోషల్‌ మీడియాలో ఆచార్య చిత్రంలో మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.ఈయన విజేత చిత్రంతో పరిచయం అయ్యి తీవ్రంగా నిరాశ పర్చాడు.అందుకే తదుపరి చిత్రం విషయంలో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.ప్రస్తుతం కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య మూవీలో కూడా ఆయన నటిస్తున్నట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే ఆచార్య చిత్రంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ను డిజైన్‌ చేస్తోంది.ఇక చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ దేవ్‌ కూడా నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మీడియాలో ఈమద్య కాలంలో ఆచార్య గురించి ఇబ్బడి ముమ్మడిగా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈ సినిమా పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో చిన్న పుకారు కూడా పెద్దగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా కళ్యాణ్‌ దేవ్‌ విషయంలో కూడా వార్తలు నిజం కాదనే వాదన వినిపిస్తుంది.అసలు విషయం ఏంటీ అనేది మెగా ఫ్యామిలీ నుండి ప్రకటన వస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.