తమిళ్ లో రీమేక్ కానున్న “అల వైకుంఠపురములో”…హీరో ఎవరంటే…?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నివేతా పేతురాజ్ మరియు సుశాంత్, అలాగే టబు మరియు జైరాం వంటి నటుల కలయికలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”.
ఒక్క బన్నీ కెరీర్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. మన తెలుగులో ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ చిత్రం అందుకున్న విజయం ఇండియా మొత్తం వ్యాపించింది. దీనితో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు తమిళ్ లో రీమేక్ కానున్నట్టు బజ్ వినిపిస్తుంది. అక్కడ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మన దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.