Sports

మోస్ట్ అవైటెడ్ 2020 ఐపీఎల్ పై ఆసక్తికర న్యూస్..!

ఈ ఏడాది అంతా బావున్నట్టయితే ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇప్పటికే చాలా మంది చాలా అంచనాలు పెట్టుకున్న 2020 సంవత్సరం ఇది. అలా మన దేశ సమస్త 130 కోట్ల మంది ప్రజలను ఉర్రూతలూ ఊగించే ఈ ట్వంటీ 20 ఫార్మాట్ ఈ 20 20లో అంతగా కలసి రాలేదు. కరోనా వైరస్ మూలాన ఇతర దేశాల నుంచి రాకపోకలను ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు నిషేదించారు.

దీనితో రాకపోకలు అన్ని నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా దేశ ప్రధాని మోడీ ఇచ్చిన తీసుకున్న నిర్ణయం లాక్ డౌన్ నిమిత్తం మొదట చెప్పిన తేదీ ఏప్రిల్ 15 తో పూర్తయ్యిన అనంతరం ఐపీఎల్ తప్పకుండా మొదలవుతుంది అని అంతా భావించారు. కానీ ఇప్పుడు అది కాస్త ఇప్పుడు మే 3 వరకు వెళ్లగా మళ్ళీ ఐపీఎల్ అభిమానులకు నిరాశ తప్పలేదు.

అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంకా ఐపీఎల్ ను రద్దు చేయనట్టు తెలుస్తుంది. అంటే ఈ లాక్ డౌన్ తారీఖు వరకు వేచి చూస్తే అప్పుడు అయినా ఐపీఎల్ పెట్టే అవకాశం ఉన్నట్టే అని చెప్పాలి. దీనిపై బీసీసీఐ వారు ఒక కీలక చర్చ జరిపి ఒక తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్టు సమాచారం.