Movies

భారీ డీల్ వదిలేసిన మహేష్…మహేశ్ ఆలోచన ఇదే

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలు చేస్తూనే ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు.తన సినిమాలనే కాకుండా ఇతర హీరోల సినిమాలను సైతం ప్రొడ్యూస్ చేస్తున్నాడు.తాజగా యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’ను మహేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ సోనీతో కలిసి ఓ భారీ ఒప్పందం చేసుకున్న మహేష్, ప్రస్తుతం ఆ డీల్ నుండి బయటకు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక సరికొత్త ఓటీటీ ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేసేందుకు మహేష్‌తో సోని డీల్ కుదుర్చుకుంది.ఈ క్రమంలో మేజర్ సినిమాను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.అయితే ఇప్పుడు మహేష్ సొంతంగా ఓటీటీ ప్రాజెక్ట్ లాంఛ్ చేయాలని చూస్తున్నాడట.

అందుకు సోనీ డీల్ నుండి బయటకొచ్చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అంతేగాక తన చిత్రాలను సొంత ఓటీటీపై రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడట.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.