Movies

పూజా హెగ్డే కి ఆ హీరో అంటే చాలా భయమట…ఆ హీరో ఎవరు?

టాలీవుడ్ లో ప్రస్తుతం గ్లామర్ డాల్ పూజా హెగ్డే వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.ఇటీవల కాలంలో ఈ అమ్మడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించినటువంటి “అల వైకుంఠపురములో” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచే గాక బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే ఈ విషయంపై పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఎన్నో గొప్ప మరియు వైవిధ్య భరిత చిత్రాల్లో నటించిన అనుభవం ఉందని, అంతేగాక అభిమానుల్లో కూడా ఎనలేని ఫాలోయింగ్ ఉందని కాబట్టి అలాంటి హీరోతో నటించాలంటే కొంచెం భయంగా ఉందని చెప్పుకొచ్చింది.

అయితే మరోపక్క సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని సల్మాన్ ఖాన్ ద్వారా నటన పరంగా పలు అంశాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.అయితే ఈ చిత్రానికి ఇప్పటికే “కభీ ఈడ్ కభీ దివాలి” అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి “జాన్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తవడంతో ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు కేకే రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నాడు.