పుష్ప నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా…? కారణాలు అవే..!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం “పుష్ప” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా కన్నడ బ్యూటీ రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి వార్త నెట్ లో వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు “పుష్ప” చిత్రంలో కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.
అలాగే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రాలన్నీ ఆగిపోయాయి.దీంతో విజయ్ సేతుపతి డేట్లు పుష్ప చిత్రానికి సర్దుబాటు కాకపోవడంతో చిత్రం నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటుండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు తాత్కాలికంగా చిత్ర యూనిట్ సభ్యులు నిలిపివేశారు.అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ మాస్ యాంగిల్ కలిగినటువంటి లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.