సాయి పల్లవి సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేదో తెలుసా..?
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించినటువంటి “ఫిదా” అనే చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే సాయి పల్లవి ఈ చిత్రంలో తెలంగాణ యువతి పాత్రలో అదరగొట్టింది.
అంతేగాక వచ్చీరావడంతోనే కుర్రకారుని తన వైపుకి తిప్పుకొని ఫిదా చేసింది.దీంతో ఈ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం తెలుగులో బాగానే దూసుకుపోతోంది.అయితే సినిమాల్లోకి రాకముందు సాయి పల్లవి పలురకాల డాన్స్ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది.అయితే ఇందులో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డాన్స్ షో అయినటువంటి “డీ” డాన్స్ షో లో కూడా పాల్గొని డాన్స్ లో అదరగొట్టింది.
అయితే 2005వ సంవత్సరములో కస్తూరి మాన్, దాం ధూమ్, అనే మలయాళ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా అవకాశాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది.దాంతో 2015 సంవత్సరంలో ప్రేమమ్ (మలయాళం) అనే చిత్రంలో అవకాశం దక్కించుకొని నటన పరంగా బాగానే ప్రూవ్ చేసుకుంది.
ఇంక అప్పటి నుంచి సాయిపల్లవి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఏదేమైనప్పటికీ ఈ అమ్మడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే దగ్గర అయిందని చెప్పవచ్చు.అంతేగాక మేకప్ లేకుండా చాలా నేచురల్ గా నటించేటువంటి ఈ అమ్మడకి మలయాళం, తెలుగు, తమిళం, పరిశ్రమల్లో బాగానే అభిమానులున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ లో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న “విరాటపర్వం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతేగాక ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న “లవ్ స్టోరీ” అనే చిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది.