Movies

ఏమాత్రం తగ్గని మెగా “పవర్”..అదే స్థాయి రేటింగ్.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఓ భారీ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనికి ముందు టాలీవుడ్ పక్క మాస్ మసాలా చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “వినయ విధేయ రామ”.

ఈ సినిమా వెండితెర మీద ప్లాప్ అయినా బుల్లి తెర మీద మాత్రం ఎన్ని సార్లు టెలికాస్ట్ చేసినా హిట్ అవుతూనే వస్తుంది. అలా ఇప్పటికే మొత్తం ఐదు సార్లు టెలికాస్ట్ చెయ్యగా 7కు తగ్గకుండా టీఆర్పీ రేటింగ్ మూడు సార్లు అలాగే 8 కి పైగా రెండు సార్లు రాబట్టి మన తెలుగులో ఏ సినిమాకు తెచ్చుకోని టీఆర్పీ ట్రాక్ రికార్డు సెట్ చేసుకుంది.

ఇప్పుడు మళ్ళీ అదే విధంగా గత వారం కూడా టెలికాస్ట్ చెయ్యగా 7.5 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఈ సినిమా పవర్ మాత్రం ఎక్కడా తగ్గలేదని చెప్పాలి.ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను రెండు సార్లు “స్టార్ మా” వారు టెలికాస్ట్ చెయ్యగా ఇంత తక్కువ గ్యాప్ లో రెండు సార్లూ ఒకేలాంటి రేటింగ్ కొట్టడం అంటే విశేషమే అని చెప్పాలి.