ప్రైమ్ లో అదరగొడుతున్న మాస్ కా దాస్ రీసెంట్ “హిట్”.!
ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో తమ కొన్ని సినిమాలతోనే యూత్ లో మంచి సెన్సేషన్ హీరోలు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. మొదటగా విజయ్ దేవరకొండ అయితే ఆ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని చెప్పాలి. వీరిద్దరూ ఇప్పుడు యూత్ లో మంచి పేరున్న నటులు.
అయితే ఇప్పుడు విజయ్ కాస్త తడబడినా విశ్వక్ మాత్రం తనదైన శైలి సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “హిట్”. మంచి సస్పెన్స్ మరియు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పేరుకు తగ్గట్టే “హిట్”అయ్యింది. అలా థియేటర్స్ నుంచి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ లో ఇటీవలే రాగా దీనికి ట్రెమండ్యస్ రెస్పాన్స్ వచ్చినట్టుగా సినీ ట్రాకర్స్ చెప్తున్నారు. రీసెంట్ గా విడుదల కాబడిన సినిమాలు అన్నింటిలోనూ ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూవర్ షిప్స్ వస్తున్నాయట. దీనితో మాస్ కా దాస్ హిట్ డిజిటల్ గా కూడా “హిట్” అయ్యిందని చెప్పాలి.