Movies

RRR సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు…ఏమన్నారంటే…?

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. అయితే ఈ ఉగాదికి సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాదు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేయడంతో ఈ రెండు సినిమాపై మరింత అంచనాలను నెలకొల్పాయి

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాపై స్పందించిన నాగబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తన యూట్యూబ్ ఛానల్ ‘మై ఛానల్ నా ఇష్టం’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగబాబు RRR సినిమా గురించి మాట్లాడుతూ తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ప్రోమో తాను చూశానని, ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ప్రోమో చూడాలని ఎంతో ఆశగా ఉందని అన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు, కొమురం భీం సమకాలీనులా, కాదా అనేదైతే నాకైతే తెలియదు కానీ ఆ ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కథతో ఈ మూవీ రూపొందుతోందని బయట టాక్ నడుస్తోంది. అది నిజమో కాదో చెప్పలేం బట్ ఇలాంటి ఊహాగానాలు RRR పై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయని నాగబాబు అన్నారు.