Movies

RRR లో ఏ హీరో ఎక్కువసేపు కనపడతాడో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే ఈ సినిమాలో ఒక్క హీరో పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని గతకొద్ది రోజులుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.జక్కన్నకు తారక్ అంటే ఎక్కువ ఇష్టం.దీంతో తారక్ పాత్రను చాలా ఎక్కవగా చూపిస్తాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.

అయితే ఇలాంటి వార్తలకు జక్కన్న చెక్ పెట్టాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోల స్క్రీన్ టైమ్ ఒకేలా ఉంటుందని తెలిపాడు.ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో ఇద్దరిని సమానమైన సమయంలోనే చూపించనున్నట్లు ఆయన అన్నారు.మొత్తానికి ఈ వార్తతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్‌కు చెక్ పడిందనే అనాలి.