బోయపాటి సినిమాలో బాలకృష్ణ హీరో,విలన్ రెండు పాత్రలు చేస్తాడట ….ఎలా ఉంటుందో మరి
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఓ పక్క బోయపాటికి వినయ విధేయ రామ మూవీతో డిజాస్టర్ మిగలగా, మరోపక్క బాలయ్యకు గత ఏడాది ఓ చేదు అనుభవంగా మిగిలిపోయింది. తండ్రి నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులతో పాటు భారీ అంచనాల నడుమ విడుదలైన రూలర్ సినిమా కూడా బాక్సాఫిస్ వద్ద బోల్తాపడ్డాయి.
ఇలా బోయపాటి,బాలయ్య కూడా బ్రేక్ కోసం సినిమా చేస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ కనిపించనున్నాడని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరి కాంబోపై సూపర్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీలో ఒక పాత్ర అఘోర గెటప్ లో ఉంటుందని ఇప్పటికే తెల్సింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాలో స్పెషల్ గా విలన్స్ లేరట.
విలన్ లేకుండా సినిమా తీయడం ఏంటి..? అసలు విలన్ లేకుండా బోయపాటి సినిమా తీస్తాడా..? అని అనిపించవచ్చు. విషయంలోకి వెళ్తే, ఈ సినిమాలో హీరోగా నే కాదు, విలన్‌గానూ బాలయ్యనే కనిపించనున్నాడట. అఘోర పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్ లో ప్రెజంట్ చేస్తారని ఫిలిం వర్గాల్లో టాక్. అయితే ఈ సినిమాలో ఓ స్ట్రాంగ్ లేడీ విలన్ రోల్ భూమిక నటించబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటిని ఒప్పించి మరీ బాలయ్య ఈ సినిమాలో విలన్ పాత్రకు భూమిక ని ఒకే చేయించాడట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.