SportsUncategorized

ఆ రోజు హోటల్ రూమ్ లో నక్కి దాక్కున్న రవిశాస్త్రి ని బయటకు లాగి ఏం చేశారంటే..

ఆ రోజు హోటల్ రూమ్ లో నక్కి దాక్కున్న రవిశాస్త్రి ని బయటకు లాగి ఏం చేశారంటే.. 

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ క్రికెటర్ డాషింగ్ బ్యాట్స్ మెన్ జావేద్ మియాందాద్, అలనాటి రోజులు గుర్తు చేసుకుంటూ, ఒక యూట్యూబ్ వీడియో  లో మాట్లాడుతూ, పాకిస్తాన్ జట్టు ఇండియా టూర్ సందర్భంగా బెంగళూరు హోటల్ లో జరిగిన ఒక ఆహ్లాదకర సంఘటన గూర్చి చెప్పాడు. 

బెంగళూరు టెస్ట్ సందర్భం గా ఇండియా, పాకిస్తాన్ జట్లు రెండూ బెంగళూరు లోని ఒకే హోటల్ లో బస చేశాయి. అవి హోలీ రోజులు. అక్కడ ప్రజలు హోలీ ఆడడం ప్రారంభించారు. మేము కూడా ఇమ్రాన్ ఖాన్ రూమ్ లోకి ప్రవేశించామని, అక్కడ అందరం ఒకరి పై ఒకరు రంగులు జల్లుకున్నామని తెలిపాడు. అప్పుడు తాము భారత క్రికెటర్లను కూడా వదలలేదని తెలిపాడు. ఆ జట్టు తో తమకు ఎటువంటి ద్వేషాలు లేవని గుర్తు చేసుకున్నాడు. 

ఆ సందర్భం గా రవిశాస్త్రి తన రూమ్ లో నక్కి దాక్కుని ఉంటే, వెతికి పట్టుకుని, పాకిస్తాన్ జట్టు రవిశాస్త్రిని స్విమ్మింగ్ పూల్ లోకి విసిరేసినట్టు తెలిపాడు. రెండు జట్లు కలసి ఉల్లాసం గా సందడి చేసామని గుర్తు చేసుకున్నాడు మియాందాద్. 

ప్రతి ఒక్కరు కూడా ఒకరి పండుగలు, ఉత్సవాలలో మరొకరు పాల్గొనాలి, కలసి సెలెబ్రేట్ చేసుకోవాలి, అది మంచి పరిణామం అని చెప్పాడు. మాకు ప్రతి చోటా ఆహ్వానం లభించింది. అందరం కలసి హోలీ చేసుకున్నాము. అని తెలిపాడు. ఆ పర్యటన అన్నిటికన్నా ఉత్తమ పర్యటన గా పేర్కొన్నాడు.