Movies

నెలకు అక్షయ్ కుమార్ ఖర్చు ఎంతో తెలుసా…మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుకొస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఊహకందని పనులు చేయడంలో అందరికంటే ముందుంటాడు. అంతెందుకు, కరోనా పోరాటానికి తనవంతు విరాళం కింద ఏకంగా 28 కోట్లు ప్రకటించి, ఇప్పటి వరకు ఇండియాలో ఈయనే హైయ్యస్ట్ విరాళం అందించిన హీరో గా నిలిచాడు. బాలీవుడ్‌లో కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు కూడా ఇలా విరాళం ఇవ్వలేదు. అందుకే అక్షయ్ సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోనే అంటారు. ఇక అక్షయ్ ఖర్చులు చూస్తే, నెలకు అతడి రేంజ్ కి కనీసం కోట్ల మీద ఉండాలి కదా.

కానీ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన లెక్క చూస్తే ఔరా అనిపిస్తుంది. షూటింగ్ ఉన్నా లేకున్నా అక్షయ్ కుమార్ దినచర్య ఉదయం 4 గంటలకే మొదలవుతుంది. బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు అప్పుడే పార్టీలు అవ్వగొట్టేసి ఇంటికి వచ్చి పడుకునే టైమ్ అది.. అలాంటి టైమ్‌లో అక్షయ్ నిద్ర లేస్తాడు.. పైగా ఈయనకు పార్టీలు, పబ్బులు అలవాటు లేదు. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరం. అంతేకాదు ఏం జరిగిపోయినా సరే,సాయంత్రం ఆరు దాటితే షూటింగ్ చేయడు. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో కచ్చితంగా నిద్రలోకి వెళ్తాడు. మళ్లీ వెంటనే 4 గంటలకు లేచి వర్కవుట్స్ రెడీ అవుతాడు. షూటింగ్స్‌కు ఆలస్యంగా వెళ్తే తన నిర్మాతలకు నష్టం కలుగుతుందనే భావన ఉండబట్టే, షూటింగ్‌కు ఆన్ టైమ్ వెళ్లడం అలవాటు చేసుకున్నానని అక్షయ్ చెప్పాడు.

ఇక ఎన్ని పనులున్నా కూడా తన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కచ్చితంగా ఇస్తానని.. అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదని అక్షయ్ కుమార్ చెబుతున్నాడు. డబ్బులొస్తున్నాయి కదా అని ఎక్స్ ట్రా పని చేయడం తన వల్ల కాదంటున్నాడు. పడుకునే ముందు ప్రతీరోజూ భార్యతో పేకాట (రమ్మీ) ఆడటం అలవాటు. ఈ పేకాటలో ట్వింకిల్‌కు ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలు బాకీ పడ్డానని చెప్పాడు.ఆ మధ్య కపిల్ శర్మ కామెడీ నైట్స్‌కు హాజరైన అక్షయ్ కుమార్ తన నెలసరి ఖర్చు 10 వేల రూపాయలలోపే ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇంకా ఖర్చులు పెరిగితే మరో 3 వేలకు మించి కావని చెప్పాడు. తాను మద్యం సేవించనని.. సిగరెట్లు తాగనని.. ఇక షూటింగులకు వెళ్తే నిర్మాతే తన ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. ఇక నాకు ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి అంటున్నాడు అమాయకంగా అక్షయ్.