వీరికి కూడా అందుబాటులో ఉన్న “అశ్వథ్థామ”..డోంట్ మిస్.!
ఈ కొత్త ఏడాది వచ్చిన సినిమాల్లో తెలుగు ఇండస్ట్రీకు కాసుల పంట పండింది అని చెప్పాలి. మొదటి నెలలోనే అదిరిపోయే సినిమాలతో ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా ఈ కరోనా విజృభించక ముందు వరకు మన తెలుగులో విడుదల కాబడిన అన్ని సినిమాల్లోనూ దాదాపు 90 శాతం సినిమాల శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జెమినీ మరియు వారి స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారు.
అలా సొంతం చేసుకున్న చిత్రాల్లో నాగశౌర్య మరియు మెహ్రీన్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం “అశ్వథ్థామ”. అయితే ఈ సినిమా లేటెస్ట్ గా సన్ నెక్స్ట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే సన్ నెక్స్ట్ లో ఇది వరకు తీసుకున్న సినిమాల్లో కొన్ని సన్ నెక్స్ట్ మరియు నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
దీనితో అప్పటికే సన్ నెక్స్ట్ తో తో టై అప్ అయ్యి ఉన్న “జియో సినిమా”లో అవి రాలేదు. దీనితో ఇప్పుడు అశ్వథ్థామ పై కూడా కొన్ని డౌట్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఇప్పుడు జియో యూజర్స్ కు కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను అప్పుడు కానీ మిస్సయ్యి ఉంటే ఈ లాక్ డౌన్ లో మీకు మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.