Movies

యూట్యూబ్‌లో రామ్ “దిమాక్ కరాబ్” రికార్డ్..!

గత ఏడాది డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా తెర‌కెక్కించిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను కూడా వసూల్ చేసింది. అంతేకాదు హీరో రామ్ కెరిర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా ఇస్మార్ట్ శంక‌ర్‌ నిలిచింది. ఈ సినిమా రామ్ కి అనేక రికార్డ్‌లు సాధించి పెట్టింది.

అయితే ఈ సినిమాలోని హైలెట్‌గా నిలిచిన దిమాక్ కరాబ్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ నెలకొల్పింది. గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదిన ఈ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో పెట్టగా నేటితో ఆ పాటకు 100 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది.