చరిత్ర సృష్టించిన మహేష్ బాబు..కనీ వినీ ఎరుగని రికార్డు.!
మన టాలీవుడ్ లో ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తియ్యకుండా ఆ లెవెల్లో వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చెయ్యగలిగే హీరోల్లో మహేష్ కూడా ఒకరు. మహేష్ అడుగు పెడితే రికార్డుల ప్రభంజనమే. అదే ఒక ఇండస్ట్రీ హిట్ పడితే పాత రికార్డులు అన్ని బద్దలయ్యిపోవాల్సిందే.
అలా సూపర్ స్టార్ ప్రభావం ఒక్క బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఇతర ప్లాట్ ఫామ్స్ లో చెప్పడానికి కూడా రికార్డుల కొలమానమే ఉపయోగించి తీరాలి. అలా ఇప్పుడు మహేష్ యూట్యూబ్ లో మొట్ట మొదటి సారిగా ఒక రీజనల్ భాషలో విడుదల చేసిన సినిమాతో చరిత్ర సృష్టించారు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించి మొదటి చిత్రం “శ్రీమంతుడు”. మహేష్ కు సరైన హిట్ లేని సమయంలో ఈ సినిమా మహేష్ బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం చెక్కు చెదరలేదని చూపించింది. అయితే ఈ సినిమాను ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వారు తమ యూట్యూబ్ ఛానెల్లో పెట్టగా..
దానికి ఇప్పుడు అక్షరాలా ఏంటి అక్షరాలా 100 మిలియన్ల వ్యూస్ వచ్చిపడ్డాయి. దీనితో మన టాలీవుడ్ ను ఈ రికార్డు అనుకున్న ఏకైక మొట్ట మొదటి చిత్రంగా ఇది కనీ వినీ ఎరుగని రికార్డును సెట్ చేసింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన మాస్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు.
దానితో ఈ సినిమాకు భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.అదే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా నిరూపితం అయ్యింది. ఇలా ఒక స్ట్రయిట్ భాష నుంచి మొట్టమొదటి 100 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకోవడం మన దక్షిణాదిలోనే ఒక్క మహేష్ కే చెల్లింది.