మోసగాళ్లకు మోసగాడు సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…ఎన్ని లక్షల లాభమో
తేనెమనసులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి యువ హీరోగా పేరుతెచ్చుకుంటున్న సమయంలో అప్పటికే 40సినిమాలు పూర్తయ్యాయి. కానీ ఏదో అసంతృప్తి ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో పద్మాలయ బ్యానర్ పెట్టారు. అగ్ని పరీక్ష అనే మూవీ చేసాడు. అది ప్లాప్ అయింది. మేకనస్ గోల్డ్ వంటి ఇంగ్లీషు సినిమాలు మద్రాసులో మంచి కలెక్షన్స్ తో ఆడుతున్నాయి. దాంతో ఆరుద్రను కల్సి మనసులో మాట చెప్పాడు. అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో మన నేటివిటీకి తగ్గట్టు అద్భుత కథ రాశారు. డైరెక్షన్ కూడా ఆయన్నే చేయమనడంతో తన పని రాయడం మాత్రమేనని ఆరుద్ర చెప్పేసారు.
దాంతో అప్పటికే టక్కరి దొంగ చక్కని చుక్క మూవీ తీసిన కె ఎస్ ఆర్ దాస్ కి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించాడు. హీరోయిన్ గా విజయనిర్మల, విలన్ గా నాగభూషణం,ఇంకో ప్రధాన పాత్రలో గుమ్మడి ఇలా సెలక్షన్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఆదినారాయణరావు, ఫొటోగ్రఫీకి వి ఎస్ ఆర్ స్వామి కుదిరారు. తోట వెంకటేశ్వరరావు. ఇక చిన్నప్పటి కృష్ణగా కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు సెట్ అయ్యారు. అప్పట్లో ఎన్టీఆర్,అక్కినేని చిత్రాలకే 7నుంచి 8లక్షల బడ్జెట్. మరి కృష్ణతో ఇంతటి బడ్జెట్ అంటే అప్పట్లో హాట్ టాపిక్. కథకు తగ్గట్టు వేరే లొకేషన్స్ కి వెళ్ళాలి. వాహిని స్టూడియోలో సెట్ వేసి ఇంటర్నల్ సీన్స్ తీశారు. హిమాచల్ ప్రదేశ్ లో లోయ,జలపాతం,రాజస్తాన్ ఎడారి ,కోట,ఇలా అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువ అయింది.
పాక్,చైనా సరిహద్దులో టిబెట్ పీఠభూమి దగ్గర షూటింగ్ చేసారు. నీళ్లు దొరక్క మొహం మాడిపోయే సీన్ కోసం చాలాసేపు కృష్ణ వాటర్ తగ్గలేదట. మొహం మీద గ్లిస్టర్స్ కూడా వచ్చే సీన్ కోసం మేకప్ మాన్ మాధవరావు బఠాణి తొక్కలు కృష్ణ మొహం మీద అంటించాడట. ఇక విజయనిర్మల ఫైట్స్,గుర్రపు స్వారీ తొలిసారి కష్టపడి చేసింది. షూటింగ్ కోసం యూనిట్ ని మద్రాసు నుంచి ఢిల్లీకి ఓ స్పెషల్ ట్రైన్ లో తీసుకెళ్లి రూమ్స్ ఎరేంజ్ చేశారట. అక్కడనుంచి ట్రైన్స్,కార్లలో లొకేషన్స్ కి చేర్చేవారట. అదృష్ట రేఖ టైటిల్ అనుకున్నా ,మాస్ కోసం మోసగాళ్లకు మోసగాడు అనిపెట్టారు. 1971ఆగస్టు 31న 37కేంద్రాల్లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ ,పౌరాణిక ట్రెండ్ తో నడుస్తున్న సమయంలో ఈ మూవీ కొత్తగా ఉంది. పూర్తి ఈస్టమన్ కలర్ లో వచ్చిన మూవీ. ఎన్టీఆర్,అక్కినేని అయితే కృష్ణను పొగుడుతూ ఓ ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. 50లక్షల గ్రాస్ వసూలు చేసింది. తమిళం,హిందీలో డబ్బింగ్ చేయడంతో హిట్ అయింది. ఇంగ్లీషులో ట్రెజర్ హంటర్ గా డబ్బింగ్ అవ్వడమే కాదు విజయాన్ని సాధించింది. 80దేశాల్లో రిలీజ్ అయింది. ఇప్పటి బాహుబలి 2తో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్స్ సమానం గా ఉంటాయని టాక్.