Movies

ఓటీటీ(OTT) ప్లాట్ ఫార్మ్స్ కండీషన్స్ కి హీరోలు నో …ఎందుకో తెలుసా ?

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3వరకూ పొడిగించిన నేపథ్యంలో ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్స్ట్, ఆహా, ఎరోస్ వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. విడుదలకు రెడీ అయిన సినిమాల్ని తమ వైపుకు లాక్కోవాలని చూస్తున్నాయి. మంచి రేట్లతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయట. సినిమాల్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నా సరే, హీరోలే రెడీగా లేరట. దానికి కారణం ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పెట్టే కండిషన్స్ మన హీరోలకు నచ్చడం లేదట.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమా స్ట్రీమింగ్ కి ముందు, హీరోహీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలని కండిషన్స్ పెడుతున్నాయట. సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి ముందు హీరోహీరోయిన్లు దర్శకులు పబ్లిసిటీలో బిజీగా ఉంటారు. ఆ ప్రచారం ఏదో తమకు చేసి పెట్టాలన్నది ఓటీటీ కండిషన్ గా ఉంది. ఫేస్ బుక్ లైవ్ ల ద్వారా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఏ రోజున సినిమా రాబోతోందో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటివి చేయాలట. న్యూస్ పేపర్స్ , టీవీల్లో ఇచ్చే యాడ్స్ ఖర్చు మాదిరిగా ఇందుకయ్యే ఖర్చు నిర్మాతలే భరించాలట.

ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఒకే చెప్పినా, హీరోలు మాత్రం పబ్లిసిటీకి నో అంటున్నారట. ధియేటర్లో సినిమా విడుదల చేస్తానంటే ఎంతైనా పబ్లిసిటీ చేస్తాం.. కానీ ఇలా ఓటీటీకి పబ్లిసిటీ కి నో అంటున్నారట. దీనిపై టాలీవుడ్ లోని నిర్మాతలు అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారట. ఈ డిస్కషన్ లో సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి అమ్మడం గురించి, వాటి కండిషన్స్ గురించి, వాటిపై హీరోలను ఎలా ఒప్పించాలా వంటి వాటిపై చర్చించారట. మొత్తం మీద కొంతకాలం వేచి చూసే ధోరణే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు టాక్. పబ్లిసిటీ విషయంలో ఓటీటీలు హీరోలపై ఒత్తిడి లేకుంటే సమస్య సమసిపోయినట్టే. ఏం జరుగుతుందో వేచి చూడాలి.