Movies

పుష్ప సినిమా కోసం ఆ హీరోయిన్ రిఫర్ చేసిన బన్నీ…ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మూడో సినిమా పుష్ప.పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కబోతున్న ఈ సినిమాతో మరోసారి సుకుమార్ తనలోని మాస్ యాంగిల్ ని బయటకి తీసుకొచ్చాడు.చిత్తూరు గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది అనే విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచారు.

ఇందులో మెయిన్ హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.ఈమె ఓ ట్రైబల్ యువతీగా ఈ సినిమాలో కనిపిస్తుంది అని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చిన కథలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.ఇక ఈ పాత్ర కోసం మంచి పెర్ఫార్మెన్స్ చూపించే హీరోయిన్ ని ఫైనల్ చేయాలని సుకుమార్ చూస్తుండగా అల్లు అర్జున్ ఊహించని విధంగా తమిళ భామ నివేతా పేతురాజ్ ని రిఫర్ చేసాడని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ భామ అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదు.అయిన కూడా నివేతా ఈ సినిమాలో ఉన్నదాంట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించింది.క్లైమాక్స్ సాంగ్ లో కూడా కనిపిస్తుంది.ఈ భామ యాక్టింగ్ కి ఫిదా అయిన బన్నీ పుష్ప సినిమాలో సెకండ్ లీడ్ కోసం నివేతాకి ఓటు వేసినట్లు టాక్ వినిపిస్తుంది.