అప్పుడే “పుష్ప” శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బన్నీ మొట్ట మొదటిసారిగా తన పాన్ ఇండియన్ పేజ్ ను మొదలు పెట్టారు.
ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా మొదలు పెట్టేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ముందు బన్నీ నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ టీవీ వారే ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ సినిమాకు కూడా భారీ ధరే పలికి ఉంటుంది.అలాగే అన్ని భాషల్లో కూడా సన్ నెట్వర్క్ వారే కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంకా దీనికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.