RRR సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కీరవాణి
దర్శక ధీరుడు రాజమౌళి రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అయితే రాజమౌళి ప్రతి సినిమా కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ల RRR చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సంగీత దర్శకుడు కీరవాణి వెల్లడించారు.
కరోనా వైరస్ కారణంగా అందరూ లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం ఇంటి వద్ద నుండే అందిస్తున్నారు. అయితే ఈ చిత్ర సంగీతం బాహుబలి సిరీస్ లని మించి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ చిత్రంలో 10 పాటలు ఉన్నాయని, అవి ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈచిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు, అలానే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. మొదటిసారిగా ఒక చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు వీడియో లో వున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.