Movies

సుమ Vs అనసూయ ఇద్దరిలో ఎక్కువ ఆస్థి ఎవరికీ ఉందొ తెలుసా?

తెలుగు బుల్లితెరపై చాలామంది యాంకర్లు ఉన్నారు. అయితే అందులో రెండు దశాబ్దాలకు పైగా తన యాంకరింగ్ తో అదరగొడుతూ ,పంచ్ డైలాగులతో జనానికి దగ్గరైన సుమ దాదాపు డజనుకు పైనే షోస్ నడిపింది. ఇంకా నడిపిస్తోంది. స్టార్ మహిళా, పంచావతారం,సూపర్ సింగర్,అవాక్కయ్యారా, జీన్స్,భలే చాన్సులే,పట్టుకుంటే పట్టుచీర,లక్కీడిప్ ఇలా ఎన్నో షోస్ కి యాంకర్ గా వ్యవహరించి దుమ్మురేపింది. ఇన్ని ప్రోగ్రామ్స్ తో అదరగొడుతున్న సుమ సంపాదన గురించి ఆలోచిస్తే, ఓ హీరోయిన్ ఎంత సంపాదిస్తుందో సుమ సంపాదన అంత ఉంటుంది.

ఒక్కో ఎపిసోడ్ కి సుమ లక్ష రూపాయల వరకూ తీసుకుంటుంది. ఇది కాకుండా సినిమా ఈవెంట్స్ చేస్తుంది కనుక ఒక్కో ఈవెంట్ కి మూడు లక్షలు ఛార్జి చేస్తుంది. నెలకు 25రోజులు,రోజుకి 18గంటలు షూటింగ్స్ లో పాల్గొంటుంది. మొత్తానికి నెలకు 50లక్ష్లు వెనకేస్తుందని అంటున్నారు. ఇక జి తెలుగులో ఓ ప్రోగ్రాం ని నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక ఈ మధ్యే జూబ్లీ హిల్ కొన్న ఇల్లు విలువ దాదాపు 5కోట్లు ఉంటుందని చెప్పొచ్చు. శంషాబాద్ ఏరియాలో ఐదెకరాల స్థలం ఉంది. కోట్లలో విలువ ఉంటుంది. కేరళలో సుమకి ఆస్తులు ఉన్నాయని అంటారు. రెండు అధునాతన కార్లు ఉన్నాయి. మొత్తం మీద 50కోట్లు అధిపతి గా చెప్పొచ్చు.

అలాగే హీరోయిన్ రేంజ్ కి ఏమాత్రం తగ్గని అనసూయ చేతిలో దాదాపు ఆరు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇందులో రెండు షోస్ కి జడ్జిగా ఉంటోంది. అనసూయ సంపాదన విషయానికి వస్తే,ఈటీవీలో జబర్దస్త్,జీతెలుగులో లోకల్ డాన్స్,మాటీవీలో ఒక షో,ఇలా ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఒక షోకి యాంకరింగ్ కి 3లక్షలకు పైనే ఛార్జి చేస్తుంది. జడ్జిగా 5లక్షలు ముడతాయి. చాలా సినిమాల్లో నటిస్తోంది. రంగస్థలం తరవాత అనసూయ రేంజ్ పెరిగింది. ఒక్కో సినిమాకు 30లక్షలు వరకు వస్తాయట. జూబ్లీ హిల్స్ లో 5కోట్ల విలువ చేసే అధునాతన ఇల్లు ఉంది. రెండెకరాల పొలం ఉంది. అధునాతన కార్లున్నాయి. భర్త కూడా నెలకు 25లక్షలు సంపాదిస్తాడట. ఇప్పుడామె 30కోట్లకు అధిపతి.